Akhanda 2 : బాల‌య్య ‘అఖండ 2’ టీజ‌ర్‌.. గూస్ బంప్స్ అంతే..

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న అఖండ 2 చిత్ర టీజ‌ర్ వ‌చ్చేసింది.

Balakrishna Akhanda 2 Teaser out now

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘అఖండ’ చిత్రం ఎంత‌టి సంచల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ వ‌స్తోంది. ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

నట సింహం బాలయ్య బర్ డే జూన్ 10వ తేదీ. ఈ క్ర‌మంలో అంత‌కు ఒక రోజు ముందే ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించింది అఖండ 2 చిత్ర బృందం. తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

బాల‌య్య త‌న‌దైన శైలిలో డైలాగ్స్‌తో అద‌ర‌గొట్టారు. ‘నా శివుడి అనుమ‌తి లేనిదే.. ఆ యముడు క‌న్నేత్తి చూడ‌డు.. నువ్వు చూస్తావా..’ అంటూ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది.

Mahesh Babu : అఖిల్ రిసెప్షన్‌లో మహేశ్ బాబు ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా? మైండ్ బ్లాకే..

ఇక త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తంగా టీజ‌ర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఈ టీజ‌ర్‌తో చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి.

సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా నందమూరి తేజస్విని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.