Mahesh Babu : అఖిల్ రిసెప్షన్‌లో మహేశ్ బాబు ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా? మైండ్ బ్లాకే..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న బార్య న‌మ్ర‌త‌, కూతురు సితారతో క‌లిసి అఖిల్ రిషప్షన్‌ కు హాజ‌రు అయ్యారు.

Mahesh Babu : అఖిల్ రిసెప్షన్‌లో మహేశ్ బాబు ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా? మైండ్ బ్లాకే..

Do you know how much cost did mahesh babu sweatshirt at akhil reception

Updated On : June 9, 2025 / 1:28 PM IST

కింగ్ నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. త‌న ప్రియురాలు జైనబ్‌ రవ్జీ మెడ‌లో జూన్ 6న తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో అఖిల్ మూడు ముళ్లు వేశాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో వీరి వివాహం జరిగింది. ఇక ఆదివారం (జూన్ 8న‌) హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో రిసెప్ష‌న్‌ను నిర్వ‌హించారు. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

ఇక ఈ వేడుక‌కు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న బార్య న‌మ్ర‌త‌, కూతురు సితారతో క‌లిసి హాజ‌రు అయ్యారు. ఎప్ప‌టిలాగే మ‌హేశ్ సింపుల్‌గా, స్టైలిష్‌గా క‌నిపించాడు. ఆయ‌న ధ‌రించిన టీ ష‌ర్ట్ చాలా బాగుంది. ఇక చెప్పేది ఏముంది? ఆయ‌న ధ‌రించిన టీ ష‌ర్ట్ వివ‌రాలు తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు నెటిజ‌న్లు.

Manchu Vishnu : నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. కన్నప్ప తర్వాత.. ఫ్యాన్స్ గురించి విష్ణు కామెంట్స్..

ప్ర‌ముఖ లగ్జరీ బ్రాండ్ హెర్మ్స్ కు చెందింగా తెలుస్తోంది. దీని ధ‌ర చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. దీని ధ‌ర అక్ష‌రాల రూ.1.51ల‌క్ష‌లు. ఇంకా వివ‌రంగా చెప్పాలంటే రూ.1,51,678 అట‌.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌హేశ్ కెరీర్‌లో 29 మూవీగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.