Manchu Vishnu : నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. కన్నప్ప తర్వాత.. ఫ్యాన్స్ గురించి విష్ణు కామెంట్స్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఫ్యాన్స్ గురించి కామెంట్స్ చేసాడు.

Manchu Vishnu Interesting Comments on Fans in Kannappa Promotions
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప సినిమాతో జూన్ 27న రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్.. లాంటి స్టార్స్ తో ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు విష్ణు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఫ్యాన్స్ గురించి కామెంట్స్ చేసాడు.
Also Read : Manchu Vishnu Kannappa Event : గుంటూరులో మంచు విష్ణు ‘కన్నప్ప’ ప్రమోషనల్ ఈవెంట్.. ఫొటోలు..
మంచు విష్ణు మాట్లాడుతూ.. నాన్న గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను వరుసగా ఫ్లాప్ సినిమాలు ఇచ్చి ఫ్యాన్స్ ని పోగొట్టుకున్నాను. కన్నప్ప తర్వాత మళ్ళీ నాకు ఫ్యాన్స్ పెరుగుతారు. మనం రెగ్యులర్ గా మంచి సినిమాలు ఇచ్చి ఫ్యాన్స్ ని సంతృప్తిపరచాలి. లేకపోతే ఈ రోజుల్లో ఫ్యాన్స్ వేరే హీరోలకు షిఫ్ట్ అయిపోతారు. ఫ్యాన్స్ వాళ్ళ డబ్బులు, టైం, ఆలోచనలు మన మీద పెడతారు కాబట్టి వాళ్ళని మన సినిమాలతో మెప్పించాలి. లేకపోతే వాళ్ళని మెప్పించే హీరోలకు ఫ్యాన్స్ గా మారతారు అని ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసారు.
Also Read : Manchu Vishnu : శ్రీకాళహస్తి నుంచి ఆ ముగ్గుర్ని తీసుకొచ్చి కన్నప్ప సినిమా చూపించాను.. ఏమన్నా తప్పులు ఉంటే..