Manchu Vishnu : శ్రీకాళహస్తి నుంచి ఆ ముగ్గుర్ని తీసుకొచ్చి కన్నప్ప సినిమా చూపించాను.. ఏమన్నా తప్పులు ఉంటే..
మంచు విష్ణు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటికే సినిమాని కొంతమందికి చూపించానని తెలిపారు.

Manchu Vishnu Kannappa Movie Special Show to Three Members from Sri Kalahasthi
Manchu Vishnu : మంచు విష్ణు భారీగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటికే సినిమాని కొంతమందికి చూపించానని తెలిపారు.
విష్ణు మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం రైటర్ BVS రవికి సినిమా చూపించారు నాన్న. సూపర్ ఉంది అన్నారు. కేవలం ఫస్ట్ హాఫ్ ఒక్కటే చూపించారు. అప్పట్నుంచి సెకండ్ హాఫ్ చూపించమని అడుగుతూనే ఉండేవాడు. అడిగాడు. మిక్సింగ్ లేకుండానే అంత రెస్పాన్స్ ఇచ్చాడు. రెండు నెలల తర్వాత సినిమా వాయిదా వేసాక రవి, కోన వెంకట్ లతో పాటు శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుడు, శ్రీకాళహస్తి సంసృత కాలేజీ ప్రిన్సిపాల్, ఆ దేవస్థానం పాత చైర్మన్ ముగ్గురిని హైదరాబాద్ కి పిలిపించి సినిమా చూపించాను. మా వైఫ్ విరానిక వాళ్ళ నాన్నకు కూడా చూపించాను.
Also Read : 8 Vasantalu : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ నుంచి మరో టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
సినిమా చూసి ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, మార్చుకుంటాను అని చెప్పాను. రవి సినిమా చూసి అన్న మాటలు సినిమా రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ప్రధాన అర్చకులు భక్తి అంటే ఇదే అన్నారు. మా వైఫ్ వాళ్ళ నాన్న చూసి మా నాన్న చనిపోయినపుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడే ఏడ్చాను అన్నారు. వాళ్ళకి సినిమా ఫైనల్ మిక్సింగ్ అవ్వకుండానే చూపించాను. అయినా వాళ్లకు అంతలా కనెక్ట్ అయింది అని తెలిపారు.
Also Read : Manchu Vishnu Wife : వామ్మో.. మంచు విష్ణు భార్య అంత పెద్ద వ్యాపారవేత్తా..? 14 దేశాల్లో బిజినెస్ నడిపిస్తూ..