Manchu Vishnu Wife : వామ్మో.. మంచు విష్ణు భార్య అంత పెద్ద వ్యాపారవేత్తా..? 14 దేశాల్లో బిజినెస్ నడిపిస్తూ..
మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య బిజినెస్ గురించి తెలిపాడు.

Do You Know about Manchu Vishnu Wife Viranica Business
Manchu Vishnu Wife : మంచు విష్ణు భార్యగా విరానిక అందరికి పరిచయమే. 2008లో విష్ణు విరానికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. విరానిక మైజన్ అవా అనే బ్రాండ్ తో క్లాతింగ్ బిజినెస్ చేస్తుందని కొంతమందికి తెలుసు. తాజాగా మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య బిజినెస్ గురించి తెలిపాడు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. నా భార్య 2022లో చిన్నపిల్లల క్లాతింగ్ బిజినెస్ మొదలుపెట్టింది. మైజన్ అవా అనే బ్రాండ్ తో 14 ఏళ్ళ లోపు పిల్లలకు క్లాత్స్ సేల్స్ చేస్తుంది. తను ఇప్పుడు 14 దేశాల్లో బిజినెస్ చేస్తుంది. ఇటలీ మిలాన్ లో తన హెడ్ ఆఫీస్. వరల్డ్ వైడ్ తన బ్రాండ్ కి 48 స్టోర్స్ ఉన్నాయి. లండన్ లో ఉన్న హోరోడ్స్ లో తన స్టోర్ ఉంది. 175 ఏళ్ళ చరిత్రలో అక్కడ స్టోర్ పెట్టిన మొదటి ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ తనే. నాకన్నా ఎక్కువ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ లో చదివింది అని తెలిపాడు.
మంచు విష్ణు భార్య విరానిక నగల డిజైన్, జెమాలజీ, ఫ్యాషన్ మార్కెటింగ్‌లో డిగ్రీ చేసింది. పెళ్లి తర్వాత తన ఇంట్లో వాళ్లకి కొత్త డ్రెస్ లు, నగలు తనే డిజైన్ చేసేది. మొదట ఇండియాలో విరానికా అనే బొటిక్ ని నడిపి కరోనా తర్వాత లండన్ లో ఫ్యాషన్ స్టోర్ పెట్టింది. అక్కడ్నుంచి తన బిజినెస్ లను అభివృద్ధి చేసింది. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాషన్ బిజినెస్ గురించి పలు పోస్టులు చేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లల తల్లిగా ఉంటూనే మరోవైపు ఇన్ని దేశాల్లో తన బిజినెస్ ని అభివృద్ధి చేసిందంటే గ్రేట్ అని ఆమెని అభినందిస్తున్నారు.