HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’లో బందర్ పోర్ట్ సీక్వెన్స్.. 250 కోట్లతో.. బ్రిటిషర్స్ తో పవన్ ఫైట్.. కథ చెప్పేసిన డైరెక్టర్..
హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Director Jyothi Krishna Tells Interesting Topics about Pawan Kalyan HariHara VeeraMallu Movie
HariHara VeeraMallu : గత అయిదేళ్లుగా సాగిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తయి రిలీజ్ కి రెడీ అయింది. జూన్ 12 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసారు కానీ VFX వర్క్స్ ఇంకా అవ్వకపోవడంతో సినిమాని మరోసారి వాయిదా వేశారు. మూవీ యూనిట్ మాత్రం ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లు మూవీ డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మంగినపూడి బీచ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్లో హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమాలో బందర్ పోర్ట్ గురించి స్పెషల్ సీక్వెన్స్ ఉంది. 16వ శతాబ్దంలో ఇక్కడ పోర్ట్ ఎలా ఉండేది అని క్రియేట్ చేసాం. CGలో అది క్రియేట్ చేయటానికి 2 ఏళ్ళు కష్టపడ్డాం. ఆంగ్లేయులు మచిలీపట్టణం హార్బర్ కి దోచుకోడానికి వస్తే పవన్ గారు ఎదురిస్తారు. ఆ సీక్వెన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. సినిమాలో మీరు ఆ సీన్స్ చూస్తే మచిలీపట్నం మాత్రమే కాదు ఇండియాలో ఉన్న అందరూ దద్దరిల్లిపోతారు.
250 కోట్లతో చేసిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు అన్న సీజ్ ది షిప్ డైలాగ్ కి తగ్గట్టు హరిహర వీరమల్లులో సీన్స్ ఉంటాయి. అప్పట్లో మచిలీపట్టణం హార్బర్ తోనే పెద్ద బిజినెస్ జరిగింది. హరిహర వీరమల్లు కథ అంతా బందర్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది అని తెలిపారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Pawan Kalyan : OG షూట్ నుంచి స్పెషల్ ఫొటోలు వైరల్.. పవన్ కళ్యాణ్ తో తమిళ్ స్టార్ అర్జున్ దాస్..
హరిహర వీరమల్లు సినిమా మొదట గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ రిలీజ్ చేసారు. ఇప్పుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ ఆ సీన్స్ గురించే మాట్లాడారని తెలుస్తుంది.
#HariHaraVeeraMallu is a 250Cr+ epic! 💥#PawanKalyan garu trained in martial arts for a stunning Bander Port sequence, crafted over 2 years in CG!
“Seize The Ship” — we did it first! ⚔️🔥#HHVM #JyothiKrishna #PawanKalyan @amjothikrishna pic.twitter.com/VKWwybPUm7
— Milagro Movies (@MilagroMovies) June 6, 2025