Manchu Vishnu : నా యాక్టింగ్ ని ఇప్పటివరకు ఎవరూ ప్రశ్నించలేదు.. నన్ను యాక్టర్ గా జనాలు ఒప్పుకున్నారు.. కానీ.. ఆర్జీవీ వల్ల..
మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Manchu Vishnu Interesting Comments on his Acting and RGV
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. నా యాక్టింగ్ ని ఇప్పటివరకు ఎవరూ ప్రశ్నించలేదు. నేను ఎంచుకున్న సినిమాలు, కథలు, వాటి రిజల్ట్స్ ని మాత్రమే ప్రశ్నించారు. నా మొదటి సినిమాలో కూడా యాక్టింగ్ ని మెచ్చుకున్నారు. నటుడిగా నన్ను ఆడియన్స్ ఎప్పుడో యాక్సెప్ట్ చేసారు. కానీ కొంతమంది గ్రేట్ ఆర్టిస్టులతో నటించి నన్ను నేను సంతృప్తి పరుచుకోవాలి అనుకున్నా. అందుకే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్.. ఇలా స్టార్స్ ఉన్నారు.
మోహన్ లాల్ లాంటి లెజెండ్ యాక్టర్ తో నటించడం నాకు వరం. ఆయన ఒప్పుకోగానే ఆయన కాళ్ళ మీద పడ్డాను. కన్నప్ప సినిమాలో మోహన్ లాల్ గారి ముందు నిల్చొని పెద్ద డైలాగ్ చెప్పాలి. అది చెప్పాక మోహన్ లాల్ గారు దగరికి తీసుకొని అభినందించారు. నేను ఎమోషనల్ అయిపోయాను. నాకు నటుడిగా కాన్ఫిడెంట్ గా ఇచ్చింది మాత్రం ఆర్జీవీనే. ఆర్జీవీతో నేను చేసిన అనుక్షణం సినిమాతో నాకు నటుడిగా కాన్ఫిడెంట్ వచ్చింది. నా యాక్టింగ్ కి ఆ సినిమా విజిటింగ్ కార్డు లాంటింది. అందుకే ఆర్జీవీని నేను గురు అని పిలుస్తాను అని తెలిపారు.
ఇక కన్నప్ప సినిమా జూన్ 27 న రిలీజ్ కాబోతుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో అన్ని సినీ పరిశ్రమల నుంచి పలువురు స్టార్స్ తో ఈ సినిమాని భారీగా తెరకెక్కించారు.