8 Vasantalu : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ నుంచి మ‌రో టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

అనంతిక సనీల్ కుమార్ న‌టిస్తున్న‌ ‘8 వసంతాలు’ నుంచి మ‌రో టీజర్ వచ్చేసింది.

8 Vasantalu : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ నుంచి మ‌రో టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

Ananthika Sanilkumar 8 Vasantalu Teaser 2 out now

Updated On : June 7, 2025 / 4:04 PM IST

మ్యాడ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనంతిక సనీల్ కుమార్. ఆమె క‌థానాయిక‌గా న‌టిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. మధురం, మను లాంటి బ్యూటిఫుల్ సినిమాలు తీసిన ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ పై ఈ చిత్రం నిర్మిమిత‌మ‌వుతోంది.

రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్‌, పాట‌లు, టీజ‌ర్ విడుద‌ల కాగా వాటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మ‌రో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Naveena Reddy : టాలీవుడ్ లో వరుస సినిమాలతో మెప్పిస్తున్న తెలుగమ్మాయి నవీనా రెడ్డి..

అనంతిక సనీల్ కుమార్ న‌టన అదిరిపోయింది. డైలాగ్స్ అదిరిపోయాయి. చూస్తుంటే ఇది ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ అని అనిపిస్తోంది. మొత్తంగా టీజ‌ర్ అదిరిపోయింది. ఇక ఈ చిత్రం జూన్ 20న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.