×
Ad

Balakrishna : నా పరువు నిలబెట్టావు.. శర్వానంద్ ని అభినందించిన బాలయ్య.. ఎందుకో తెలుసా?

శర్వానంద్ ఇటీవల సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. (Balakrishna)

Balakrishna

Balakrishna : శర్వానంద్ ఇటీవల సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అందర్నీ మెప్పించి మంచి విజయం సాధించింది. చాన్నాళ్ల తర్వాత శర్వానంద్ కి భారీ విజయం దక్కింది.(Balakrishna)

అయితే నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ ని బాలకృష్ణ లాంచ్ చేసారు. ఈ టైటిల్ తో గతంలో బాలకృష్ణ సినిమా తీసి హిట్ కొట్టారు. ఇప్పుడు శర్వానంద్ హిట్ కొట్టాడు. తాజాగా నారీ నారీ నడుమ మురారి సక్సెస్ అనంతరం శర్వానంద్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ సినిమాపై బాలకృష్ణ స్పందన గురించి తెలిపాడు శర్వానంద్.

Also Read : Chiranjeevi : మీరు లేనిదే నేను లేను.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..

శర్వానంద్ మాట్లాడుతూ.. బాలయ్య గారి సినిమా టైటిల్ తీసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ టైటిల్ కి తగ్గ న్యాయం చేయాలి అనుకున్నాము. ప్రెజర్ లేదు కానీ బాలయ్య గారి టైటిల్ చెడగొట్టొద్దు అనుకున్నాము. సినిమా రిలీజ్ తర్వాత హిట్ అయ్యిందని తెలుసుకొని బాలయ్య గారే ఫోన్ చేసి నా పరువు నిలబెట్టావ్ శర్వా అన్నారని తెలిపాడు.

మొత్తానికి నారీ నారీ నడుమ మురారి టైటిల్ తో అప్పుడు బాలయ్య ఇప్పుడు శర్వానంద్ ఇద్దరూ మంచి హిట్స్ కొట్టారు.

Also Read : Allu Arjun : మామ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ..