Unstoppable : ఆ విషయంలో పవన్ ని అభినందించిన బాలయ్య..

పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర అనే పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు తన పార్టీ తరపున కొంత డబ్బు సహాయం చేశారు.............

Balakrishna Appriciated Pawan Kalyan in Unstoppable show

Unstoppable : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు వెయ్యట్లేదు? పవన్ కళ్యాణ్ ఏం సమాధానం ఇచ్చాడు?

పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర అనే పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు తన పార్టీ తరపున కొంత డబ్బు సహాయం చేశారు. ఈ మంచిపనికి చాలా మంది తోడయ్యారు. చాలా మంది అభినందించారు. అయితే దీనిపై కూడా ప్రభుత్వం ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా షోలో బాలకృష్ణ ఈ రైతులకు సహాయం చేయడంపై మాట్లాడుతూ.. చనిపోయిన రైతు కుటుంబాలకు నీ చేతుల్లోంచి తీసి డబ్బులు ఇస్తున్నావు. ఆ విషయంలో మాత్రం నిన్ను అభినందించలేకపోతున్నాను అని పవన్ కళ్యాణ్ ని హత్తుకొని అభినందించారు. దీంతో మరోసారి అంతా పవన్ ని అభినందిస్తున్నారు.