akhanda 2
Akhanda 2 : అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడి బాగా వైరల్ అయి కాంట్రవర్సీ కూడా అయింది. బాలయ్య సినిమా అయినా సరే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలనుకున్నా సడెన్‌గా ఫైనాన్స్ వ్యవహారం విడదలకు అడ్డంకి అయింది. ఎట్టకేలకు ఆ ఇష్యూకు చెక్ పెట్టి థియేటర్లలో అడుగు పెట్టిన అఖండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
బాలయ్య మార్క్ ఎలివేషన్ సీన్స్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నా ముందే రిలీజ్ చేసి ఉంటే అప్పుడున్న హైప్ కి ఇంకా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి అని అంటున్నారు. అయితే అఖండ మూవీకి సంబంధించి టాలీవుడ్‌లో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. అఖండ-2 నిర్మాతలను బాలయ్య దూరం పెట్టారని, పిలిచి మరి సినిమా ఇచ్చి డేట్స్ ఇస్తే తన కెరీర్‌లో ఎప్పుడు ఊహించని అడ్డంకులు అఖండ-2కు వచ్చాయని, ఈ రచ్చకు నిర్మాతలే కారణమన భావనలో బాలయ్య ఉన్నారట.
Also Read : Akira Nandan : అకిరా నందన్ తో పాన్ వరల్డ్ సినిమా.. రెడీ అంటున్న పవన్ కళ్యాణ్ నిర్మాత..
అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ వేర్వేరుగా చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. డైరెక్టర్ బోయపాటి, తమన్ కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటే ప్రొడ్యూసర్స్ వేరే ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరి దారి వారిదే అయిపోయింది. మరోసారి సేమ్ ఇలాగే జరగటంతో అఖండ 2 నిర్మాతలు హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న టైమ్‌లో బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, థమన్ ఒకే వేదిక మీదుంటే, నిర్మాతలు గోపి ఆచంట, రామ్ ఆచంటలు శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్లటంతో టాలీవుడ్‌లో పెద్ద చర్చనే జరుగుతుంది.
ఫస్ట్ టైమ్ బాలయ్య నిర్మాతలను ఇలా దూరం పెట్టడం చూస్తుంటే మిగతా ప్రొడ్యూసర్స్ అలర్ట్ అవుతున్నారట. ఇక నుంచి బాలయ్య సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారట. అఖండ-2 నిర్మాతలను బాలయ్య దూరం పెట్టారా లేక ఉట్టి రూమరేనా అనేది వేచి చూడాలి.
Also See : Dil Raju : భార్య కొడుకుతో కలిసి దిల్ రాజు స్పెషల్ పూజలు.. ఫొటోలు వైరల్..