Bhairava Dweepam : బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘భైరవ ద్వీపం’ రీ రిలీజ్..

ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయిడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది.

Balakrishna Bhairava Dweepam Movie Re Releasing on August 5th

Bhairava Dweepam :  ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలని, స్టార్ హీరోల మంచి మంచి సినిమాలని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ లకు అభిమానులు ఎగబడి మరీ వెళ్లడం, కలెక్షన్స్ కూడా బాగా వస్తుండటంతో ఇటీవల సినిమాల రీ రిలీజ్ లు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ఫాంటసీ డ్రామా ‘భైరవ ద్వీపం’ త్వరలో రీ రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయిడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం 1994లో రిలీజయి భారీ విజయం సాధించింది. బాలకృష్ణ, రోజా ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా కథ, పాటలు, కథనం అప్పట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. కలెక్షన్స్ సాధించడమే కాక 9 నంది అవార్డులని గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది భైరవ ద్వీపం.

Pawan Kalyan : స్టేజిపై మేనల్లుడికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. బాలీవుడ్ డిజైనర్‌తో డిజైన్ చేయించి మరీ..

భైరవ ద్వీపం సినిమాని 4K వర్షన్ లో మార్చి క్లాప్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సంస్థ ఆగస్ట్‌ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోసారి బాలయ్య అభిమానులు ఈ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయనున్నారు.