Akhanda 2 : బాలయ్య ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.. తాండవం రాబోతుంది..

నేడు అఖండ 2 టీజర్ అప్డేట్ ఇచ్చారు.

Balakrishna Boyapati Sreenu Akhanda 2 Teaser Update

Akhanda 2 : సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో మెప్పించిన బాలయ్య ఇప్పుడు అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జార్జియా దేశంలో జరుగుతుంది. అఖండ సినిమాకు సీక్వెల్ కావడం, బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

నేడు అఖండ 2 టీజర్ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ – బోయపాటి అఖండ 2 టీజర్ రేపు జూన్ 9 సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. టీజర్ తాండవం చేయబోతుంది అంటూ త్రిశూలంతో ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ 2 టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Balakrishna : బాలయ్య నెక్స్ట్ సినిమా అనౌన్స్.. NBK 111.. మళ్ళీ ఆ డైరెక్టర్ తో.. రామ్ చరణ్ నిర్మాతలతో..

ఇక ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25 రిలీజ్ అవ్వనుంది.

 

Also Read : Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఏమేం సినిమాలు తీశారో తెలుసా?