Balakrishna confirms Akhanda Sequel at goa film festival
Balakrishna : టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలో అద్భుతమైన విజయాల్ని నమోదు చేయడమే కాకుండా, బాలయ్య కెరీర్ లోనే మైల్ స్టోన్స్‌గా నిలిచిపోయాయి. ఇక చివరిగా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అఖండ”.
Balakrishna : నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..
ఈ సినిమాలో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించి తన నటనా విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై బాలకృష్ణ స్పందించాడు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలకు హాజరయిన బాలకృష్ణ.. “అఖండ-2 తప్పకుండా ఉంటుంది. సబ్జెక్టు కూడా సిద్ధంగా ఉంది. సినిమా అనౌన్స్ చేయడమే లేటు” అంటూ వెల్లడించాడు.
కాగా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ పనోరమా ప్రధాన స్రవంతి విభాగంలో ‘అఖండ’ సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యి సందడి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ తెరకెక్కిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.