Balakrishna : నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి బాలకృష్ణ నటవారసుడు ఎంట్రీ ఎప్పుడంటూ టాలీవుడ్ లో ఎప్పటినుంచో చర్చ జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలకు హాజరయ్యాడు. ఆ కారిక్రమంలో బాలయ్యని.. మీ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఎప్పుడు అంటూ ప్రశ్నించారు.

Balakrishna : నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

Balakrishna gave clarity on Nandamuri Mokshagna's entry

Balakrishna : నందమూరి బాలకృష్ణ నటవారసుడు ఎంట్రీ ఎప్పుడంటూ టాలీవుడ్ లో ఎప్పటినుంచో చర్చ జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలకు హాజరయ్యాడు. ఆ కారిక్రమంలో బాలయ్యని.. మీ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఎప్పుడు అంటూ ప్రశ్నించారు.

Balakrishna: బాలయ్య కోసం మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?

దానికి బాలకృష్ణ బదులిస్తూ.. వచ్చే ఏడాది మోక్షజ్ఞని వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు వెల్లడించాడు. కాగా మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి దర్శకత్వంలో ఉండబోతుంది అంటూ టాలీవుడ్ లో ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి కూడా ప్రశ్నించగా.. బాలకృష్ణ నవ్వుతూ ‘అంతా దైవేచ్ఛ’ అంటూ బదులిచ్చాడు.

ఇక ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడు వారసుడిని, హీరోగా వెండితెర మీద చూస్తామో అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు.. ఈ వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలయిన ‘జై బాలయ్య’ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.