Balakrishna: బాలయ్య కోసం మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బిజీగా పాల్గొంటూనే, బాలయ్య తన టాక్ షో అన్‌స్టాపబుల్-2ను కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయబోతున్నాడనే విషయంపై ఇప్పటికే బాలయ్య అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Balakrishna: బాలయ్య కోసం మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?

Arjun Rampal To Play A Key Role In Anil Ravipudi Balakrishna Movie

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బిజీగా పాల్గొంటూనే, బాలయ్య తన టాక్ షో అన్‌స్టాపబుల్-2ను కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయబోతున్నాడనే విషయంపై ఇప్పటికే బాలయ్య అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Balakrishna: మరో యంగ్ డైరెక్టర్‌కు బాలయ్య ఛాన్స్.. ఈ ప్రయోగం ఫలిస్తుందా..?

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన పాత్రలో బాలయ్య నటించేందుకు రెడీ అవుతున్నాడు. బాలయ్య కెరీర్‌లో 108వ సినిమాగా రానున్న ఈ మూవీలో బాలయ్య రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. కాగా, ఈ సినిమాలో ఆయన కూతురి పాత్రలో అందాల భామ శ్రీలీల నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా ఉంటుదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ కూడా నటిస్తున్నాడట.

Balakrishna : అన్‌స్టాపబుల్.. ఇక్కడ పెళ్లిళ్లు చేయబడును..

ఈ సినిమాలోని ఓ విలన్ పాత్రలో అర్జున్ రామ్‌పాల్‌ నటించేందుకు చిత్ర యూనిట్ ఓకే చేసిందట. ఇక ఈ సినిమాలో ఆయనతో పాటు మరికొంత మంది బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి బాలయ్యను అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నాడా, అసలు ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.