Balakrishna Bobby NBK 109 Movie Update
Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ NBK109 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే NBK 109 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
గతంలో.. ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. 1980లో స్టోరీతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.
Also Read : Sravanthi Ravi Kishore : త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
NBK109 సినిమా షూటింగ్ నేడు మొదలైనట్లు ప్రకటించారు. అలాగే ఓ పోస్టర్ రిలీజ్ చేయగా అందులో.. గొడ్డలికి ఒక ఆంజనేయస్వామి బిళ్ళ ఉన్న దండ వేసి, దానికి కళ్ళజోడు పెట్టారు. ఆ కళ్ళజోడులో అవతల జరిగే పోరాట సన్నివేశాలు చూపిస్తున్నట్టు ఉండేలా పోస్టర్ ని డిజైన్ చేశారు. ఈ పోస్టర్ కి తోడు బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్, వైలెన్స్ కి విజిటింగ్ కార్డు అని బాలకృష్ణ గురించి పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. NBK109 సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
Blood Bath Ka Brand Name ?
???????? ?? ???????? ???? ?? #NBK109 Shoot begins today!! ?️Beginning a new journey with our Natasimham #NandamuriBalakrishna garu ?
I seek your blessings and support, as always. ?❤️#NBK109ShootBegins ?@vamsi84… pic.twitter.com/bYl7izkWAB
— Bobby (@dirbobby) November 8, 2023