Actress Mohini : నాకు చేతబడి చేసారు.. బాలయ్య హీరోయిన్ మోహిని..
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే...ఈ సినిమాలో బాలయ్య సరసన నటించిన మోహిని దక్షిణాదిన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు.

Actress Mohini
Actress Mohini : ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే…ఈ సినిమాలో బాలయ్య సరసన నటించిన మోహిని దక్షిణాదిన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. దాదాపు 100 సినిమాల్లో నటించిన మోహిని ఆతర్వాత పెళ్లి చేసుకుని గృహిణిగా స్ధిరపడిపోయారు. తాజాగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆమె అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లైన ఐదేళ్ల వరకు తన సంసార జీవితం చాలా హ్యాపీగా అద్భుతంగా జరిగిందని తెలిపారు. ఆతర్వాత నుంచి తనలో ఏదో తెలియని మార్పులు చోటు చేసుకున్నాయని ఒక మానసికి వేదన తనను వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పారు. ఈక్రమంలోనే తాను ఏమి చేస్తున్నానో కూడా గ్రహించలేని స్ధితిలో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో రెండుసార్లు ఆత్మాహత్యాయత్నానికి కూడా ప్రయత్నించానని వివరించారు.

Actress Mohini
ప్రతిరోజు అమ్మవారిపూజ, దైవదర్శనాలు చేసుకునే నేను కనీసం పూజ చేయటానికి మనసు కుదురుగా ఉండేది కాదు. ఇలాంటి సందిగ్దంలో ఉన్న తాను ఒక జ్యోతిష్యుని సంప్రదించగా అప్పుడు …. ఆయన తనకు చేతబడి జరిగిందని, చేతబడి జరిగి ఐదు ఏళ్లు అయినందువల్ల వారిని ఏమీ చేయలేమని… కేవలం భగవంతుడు మాత్రమే రక్షించగలడని చెప్పారు.
భగవంతుడు అంటే ఎవరు ? నన్ను రక్షించేది ఎవరు అనే సందిగ్దంలో పడ్డాను. అసలు భగవంతుడు వచ్చి నన్ను ఎలా కాపాడతాడో నాకు అర్ధంకాలేదు. ఆ సందిగ్దంలో ఉండి ధ్యానం చేస్తుంటే నాకు కలలో ఏసుక్రీస్తు కనిపించారు అని మోహిని వివరించారు. ఈ క్రమంలోనే నేను ఒక పెద్ద ప్రళయంలో కొట్టుకుపోతుండగా ఏసు ప్రభువు తన వంక చూసి నిన్ను కాపాడతాను అని చెప్పారు.

Actress Mohini
ఆతర్వాత నేను పడుతున్న సమస్య నుంచి బయటపడ్డానని, తనను రక్షించింది ఏసు ప్రభువు అని తెలుసుకున్నానని మోహిని వివరించారు. ఈక్రమంలోనే ఒక పాస్టర్ తన ఇంటికి వచ్చి ప్రార్ధనలు చేసారని ఆమె తెలిపారు. ఆ సమయంలో తాను 13 భాషలు మాట్లాడానని… నేను మాట్లాడే ప్రతిమాట నాకు తెలుస్తోందని ఆమె చెప్పారు.
ఆ సమయంలో నేను ఈ అమ్మాయిని విడిచి వెళ్లిపోతున్నానను అనేమాటలు వినిపించాయి. ఈ విధంగా ఏసుప్రభు తనను కాపాడారని నటి మోహిని తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.