Balakrishna – Sunny Deol : బాలీవుడ్ స్టార్ తో బాలయ్య.. మాస్ ఫీస్ట్ అంటూ..

తాజాగా బాలకృష్ణ బాలీవుడ్ స్టార్ ని కలిశారు.

Balakrishna Meets Bollywood Star Sunny Deol in Movie Sets Photos goes Viral

Balakrishna – Sunny Deol : బాలకృష్ణ ప్రస్తుతం NBK109 సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. దీంతో ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య సినిమా దగ్గర్లో ఏ హీరో సినిమా జరిగినా వెళ్లి పలకరిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ బాలీవుడ్ స్టార్ ని కలిశారు.

Also Read : Nara Rohit – Siree Lella : నేడే హీరో నారా రోహిత్ నిశ్చితార్థం.. ఆ సినిమా హీరోయిన్‌తో.. ఎవరో తెలుసా..?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. తాజాగా నేడు ఉదయం బాలకృష్ణ ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లి సన్నీ డియోల్ ని కలిశారు. సన్నీ డియోల్ తో కాసేపు ముచ్చట్లు పెట్టారు. అలాగే గోపీచంద్ మలినేనితో కూడా మాట్లాడారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఇటీవల వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్నీ డియోల్ – బాలయ్య కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.