Nara Rohit – Siree Lella : నేడే హీరో నారా రోహిత్ నిశ్చితార్థం.. ఆ సినిమా హీరోయిన్‌తో.. ఎవరో తెలుసా..?
తాజాగా నేడు నారా రోహిత్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని సమాచారం.

Nara Rohit Engagement with Siree Lella Today Details Here
Nara Rohit – Siree Lella : బాణం, సోలో, రౌడీఫెలో, ప్రతినిధి.. ఇలా గతంలో పలు హిట్ సినిమాలతో మెప్పించిన నారా రోహిత్ కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి ఇటీవలే మళ్ళీ ప్రతినిధి 2 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్వరలో నారా రోహిత్ సుందరకాండ సినిమాతో రాబోతున్నాడు.
అయితే తాజాగా నేడు నారా రోహిత్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని సమాచారం. ప్రతినిధి 2 సినిమాలో నటించిన హీరోయిన్ సిరి లేళ్లతో నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ప్రతినిధి 2 సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళింది.
నారా రోహిత్ – సిరి లేళ్ల నిశ్చితార్థం నేడు నోవాటెల్ లో ఉదయం 10:30 గంటలకు జరగబోతుంది. ఈ నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా చేసుకుంటున్నారట. నారా రోహిత్ పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అలాగే నారా, నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు బంధుమిత్రులు హాజరు కానున్నారు.