Utsavam : దసరా పండక్కి ఓటీటీలోకి వచ్చిన ‘ఉత్సవం’.. నాటకాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా..
థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

Regina Cassandra Utsavam Movie Streaming in OTT Details Here
Utsavam : దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా వచ్చిన సినిమా ‘ఉత్సవం’. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, అలీ, మధుబాల, ఆమని, అలీ.. ఇలా అనేకమంది స్టార్స్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కించారు. హార్న్ బిల్ బ్యానర్ పై సురేష్ పాటిల్ నిర్మాతగా అర్జున్ సాయి దర్శకత్వంలో ఉత్సవం సినిమా నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్స్ లో రిలీజయింది.
Also Read : Bipasha Basu : ఒకప్పటి హాట్ హీరోయిన్.. ఇప్పుడు కూతురుతో సింపుల్ గా.. బిపాషా కూతురు ఎంత క్యూట్ గా ఉందో..
అంతరించిపోతోన్న నాటక రంగం గురించి, వాటితోనే జీవిస్తున్న మనుషుల ఎమోషన్స్, మధ్యలో ఓ ప్రేమకథ కలిపి ఓ మంచి ఎమోషనల్ స్టోరీగా ఉత్సవం సినిమాని తెరకెక్కించారు. థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దసరా సందర్భంగా ఇటీవల అక్టోబర్ 11న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది.
బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఉత్సవం సినిమా ఓటీటీలోకి వచ్చింది. పండగ కావడంతో, మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సినిమా కావడంతో ఉత్సవం సినిమా మంచి వ్యూయర్ షిప్ దక్కించుకుంటుంది. నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, నాటక రంగంపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా బాగుంటుంది.