Bipasha Basu : ఒకప్పటి హాట్ హీరోయిన్.. ఇప్పుడు కూతురుతో సింపుల్ గా.. బిపాషా కూతురు ఎంత క్యూట్ గా ఉందో..

బిపాషా ఇటీవల రెగ్యులర్ గా తన కూతురు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది.

Bipasha Basu : ఒకప్పటి హాట్ హీరోయిన్.. ఇప్పుడు కూతురుతో సింపుల్ గా.. బిపాషా కూతురు ఎంత క్యూట్ గా ఉందో..

Bipasha Basu went to Durga Mandapam with her cute Daughter and Husband Video goes Viral

Updated On : October 13, 2024 / 8:54 AM IST

Bipasha Basu : బాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది బిపాషా బసు. చాలా సినిమాలో హాట్ హాట్ గా నటించి అప్పట్లో మల్లికా శెరావత్ తర్వాత హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది బిపాషా బసు. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు పలువురు హీరోలతో డేటింగ్ చేసినా చివరకు కరణ్ గ్రోవర్ సింగ్ అనే నటుడిని 2016 లో పెళ్లి చేసుకుంది.

Also Read : Tejaswini Nandamuri : బాలకృష్ణ రెండో కూతురు తేజస్వి ఫొటోలు చూశారా..? ఎంత క్యూట్ గా ఉందో..

2022 లో బిపాషా – కరణ్ గ్రోవర్ జంట ఒక పాపాయికి జన్మనిచ్చారు. బిపాషా ఇటీవల రెగ్యులర్ గా తన కూతురు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా దసరా సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ దుర్గా మండపానికి బిపాషా తన కూతురు, భర్త తో కలిసి వచ్చింది. దీంతో అక్కడి మీడియా ఫోటోలు తీశారు. మీడియా అడక్కుండానే బిపాషా కూతురు వచ్చి క్యూట్ గా ఫోటోలు ఇచ్చింది. ఈ వీడియో వైరల్ అవ్వగా బిపాషా కూతురు దేవి ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

అలాగే నిన్న దసరా రోజు తన కూతురుని సంప్రదాయంగా రెడీ చేసి ఓ చిన్న క్యూట్ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది బిపాషా. బిపాషా కూతురు దేవి ఎంత క్యూట్ గా ఉందొ అని కామెంట్స్ చేస్తూనే ఒకప్పటి బోల్డ్ హీరోయిన్ ఇప్పుడు ఇలా సింపుల్ గా, సాంప్రదాయంగా మారిపోయి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది అని బిపాషాని కూడా అభినందిస్తున్నారు.