Balakrishna : బాలకృష్ణ NBK 109 టైటిల్ అప్డేట్.. టైటిల్, టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నారు.

Balakrishna NBK 109 Movie Title Update announced

Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమా భారీ పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. అలాగే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Also Read : Ashok Galla – Mahesh babu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు రారు.. SSMB 29 ఫస్ట్ లుక్ పై మహేష్ మేనల్లుడి కామెంట్స్..

అయితే ఈ సినిమా టైటిల్ చెప్పమని బాలయ్య ఫ్యాన్స్ ఎప్పట్నుంచో అడుగుతున్నారు. తాజాగా NBK109 సినిమా టైటిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ ను నవంబర్ 15 ఉదయం 10 గంటల 24 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారని ప్రకటించారు. టైటిల్ తో పాటు టీజర్ రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అనౌన్స్ చేసారు. దీంతో బాలయ్య నెక్స్ట్ సినిమా టైటిల్, టీజర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.