Ashok Galla – Mahesh babu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు రారు.. SSMB 29 ఫస్ట్ లుక్ పై మహేష్ మేనల్లుడి కామెంట్స్..

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా దేవకీ నందన వాసుదేవ సినిమాతో రాబోతున్నాడు.

Ashok Galla – Mahesh babu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు రారు.. SSMB 29 ఫస్ట్ లుక్ పై మహేష్ మేనల్లుడి కామెంట్స్..

Mahesh babu Son in Law Ashok Galla Interesting Comments on SSMB29 Movie

Updated On : November 12, 2024 / 4:16 PM IST

Ashok Galla – Mahesh babu : మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా దేవకీ నందన వాసుదేవ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడాడు అశోక్ గల్లా. ఈ క్రమంలో SSMB29 సినిమా గురించి కూడా మాట్లాడారు.

దేవకీ నందన వాసుదేవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు వస్తున్నారన్న వార్తలకు అశోక్ గల్లా స్పందిస్తూ.. ఈసారి ఆయనకు కుదరకపోవచ్చు. ఆయన రాజమౌళి గారి సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. బయట కొన్ని పిక్స్ లీక్ అయినా ఆ హెవీ లుక్ ని జాగ్రత్తగానే దాస్తున్నారు. ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు గట్టి బ్యాంగ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆ లుక్స్ బయటకు రాకూడదు కాబట్టి రారు. నేను కూడా అడగలనుకోవట్లేదు అని అన్నారు. దీంతో అశోక్ గల్లా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Varun Tej : ఫిజికల్ ఛాలెంజెడ్ అభిమానిని కలిసిన వరుణ్ తేజ్.. కింద కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చి.. వీడియో వైరల్..

అశోక్ గల్లా చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఫుల్ గడ్డం, ఫుల్ జుట్టుతో కనపడే మహేష్ బాబు లుక్స్ ఫైనల్ కాదని, ఫైనల్ గా ఒక లుక్ డిజైన్ చేస్తారని, SSMB29 సినిమా ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోనుందని తెలుస్తుంది.