Varun Tej : ఫిజికల్ ఛాలెంజెడ్ అభిమానిని కలిసిన వరుణ్ తేజ్.. కింద కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చి.. వీడియో వైరల్..
ఓ ఫిజికల్ ఛాలెంజెడ్ అభిమానిని కలిశారు వరుణ్ తేజ్.

Varun Tej Mets a Physical Handicapped Lady Fan in Vijayawada Photos Videos goes Viral
Varun Tej : వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మట్కా సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ నేడు విజయవాడ వెళ్లగా అక్కడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లారు. వరుణ్ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ ఫిజికల్ ఛాలెంజెడ్ అభిమానిని కలిశారు.
Also Read : Pujita Ponnada : హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్.. చేతికి సెలైన్ తో ఫొటో షేర్ చేసి..
విజయవాడ పొట్టి శ్రీరాములు కాలేజీలో ఓ ఫిజికల్ ఛాలెంజెడ్ విద్యార్థిని ఉండగా వరుణ్ వచ్చేముందు అతన్ని కలవడానికి ఎదురుచూసింది. దీంతో వరుణ్ ఆమె దగ్గరకు వచ్చి అక్కడే కింద కూర్చొని, ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాడు. ఆమెకు ఫోటోలు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విషయంలో పలువురు వరుణ్ ని అభినందిస్తున్నారు.
Mega Prince @IAmVarunTej with a fan @ Vijayawada. ❤️#MATKA #MATKAonNOV14th pic.twitter.com/EArkkIsCrw
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 12, 2024
వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా మట్కా సినిమా తెరకెక్కింది. మట్కా అనే గేమ్ ఆధారంగా వైజాగ్ లో ఎదిగిన ఓ డాన్ కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ ఏజ్ లలో కనిపించనున్నాడు.