Balakrishna : 50 ఏళ్ళ నట జీవితానికి.. బాలయ్యకు అరుదైన అవార్డు.. కరణ్ జోహార్ చేతుల మీదుగా..

తాజాగా తన 50 ఏళ్ళ నట ప్రస్థానానికి గాను బాలయ్య స్పెషల్ అవార్డు అందుకున్నారు.

Balakrishna Received Golden Legacy Award from IIFA 2024

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ళ నటన జీవితం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే టాలీవుడ్ భారీ ఈవెంట్ నిర్వహించింది. 50 ఏళ్లుగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన బాలకృష్ణ ఎన్నో అవార్డులు అందుకోగా తాజాగా తన 50 ఏళ్ళ నట ప్రస్థానానికి గాను స్పెషల్ అవార్డు అందుకున్నారు.

Also Read : Chiranjeevi – Balakrishna – Venkatesh : మరోసారి ఒకే వేదికపై సందడి చేసిన చిరు, బాలయ్య, వెంకీ.. ఫ్యాన్స్‌కి పండగే..

తాజాగా IIFA వేడుకలు UAE లోని అబుదాబిలో ఘనంగా జరగ్గా టాలీవుడ్ సినీ ప్రముఖులు అనేకమంది ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఐఫా తరపున బాలకృష్ణకు ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు అందచేశారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందచేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా 50 ఏళ్ళ నట ప్రస్థానానికి ఐఫా నాకు గోల్డెన్ లెగసి అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉంది. నాటి తోటి స్టార్స్ తో మంచి స్పోర్టివ్ కాంపిటేషన్ ఉంటుంది. నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను అని తెలిపారు.