Balakrishna Says Akhanda 2 Movie Dialogue in Movie Opening ceremony
Balakrishna : నేడు బాలకృష్ణ అఖండ 2 సినిమా ఓపెనింగ్ జరిగింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నాలుగో సినిమాగా రాబోతుంది అఖండ 2. నేడు తన ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని.. చేతుల మీదుగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణి క్లాప్ కొట్టగా, తేజస్విని కెమెరా ఆన్ చేసారు. అయితే సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమంలోనే బాలయ్య బాబు డైలాగ్ చెప్పి అదరగొట్టారు.
Also Read : Akhanda 2 : అప్పుడే ‘అఖండ 2’ టైటిల్ థీమ్ కూడా రిలీజ్.. తమన్ తాండవం అదిరిందిగా..
అఖండ 2 సినిమాలోని డైలాగ్ ఒకటి బాలయ్య బాబు చెప్పారు. ఈ నేల అసురుడిది కాదు.. ఈశ్వరుడిది.. పరమేశ్వరుడిది.. కాదని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం అంటూ డైలాగ్ చెప్పి అదరగొట్టారు. ఇలా బయట చెప్తేనే ఈ రేంజ్ లో ఉందంటే సినిమాలో తమన్ BGM తో ఈ డైలాగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు అనుకుంటున్నారు. బాలయ్య డైలాగ్ మీరు కూడా వినేయండి..
THAANDAVAM.. #Akhanda2 THAANDAVAM 🔱 🔥🔥🔥🔥#NandamuriBalakrishna pic.twitter.com/ChpbS91T0I
— Suresh PRO (@SureshPRO_) October 16, 2024
ఇప్పట్నుంచే అఖండ 2 సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు.