Venkatesh Daughters : వెంకటేష్ త్వరలో సంక్రాంతికి జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో రాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. షోలో ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి సందడి చేశారు.
తాజాగా వెంకటేష్ వచ్చిన అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో వెంకటేష్ – బాలయ్య ఫుల్ సందడి చేశారు. డైలాగులు చెప్పి, డ్యాన్సులు వేసి రచ్చ చేశారు. అనిల్ రావిపూడి, సురేష్ బాబు కూడా అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. అలాగే వెంకటేష్ నాగచైతన్య గురించి, తన కూతుళ్ళ గురించి ఈ షోలో మాట్లాడారు.
Also Read : Venkatesh – Suresh Babu : అన్‌స్టాపబుల్ షోలో నాన్నని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన వెంకటేష్, సురేష్ బాబు..
షోలో బాలయ్య కొన్ని ఫొటోలు చూపిస్తూ వెంకటేష్ కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోని కూడా చూపించాడు. ఈ ఫొటోలో వెంకీమామ తన ముగ్గురు కూతుళ్లతో ఏదో సెలబ్రేషన్ రోజున ఫోటో దిగినట్టు ఉంది. ఆ ఫోటో చూసి వెంకటేష్.. నా వండర్ ఫుల్ డాటర్స్ ఆశ్రిత, హవ్య, భావన అని వాళ్ళ పేర్లు చెప్పారు. వాళ్ళ ముగ్గురి గురించి ఇంకేం చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.
దీంతో వెంకీమామ తన ముగ్గురు కూతుళ్లతో దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. వెంకటేష్ ఇద్దరి కూతుళ్ళకు పెళ్లిళ్లు అయిపోయాయి. వెంకటేష్ కు అర్జున్ అని ఒక కొడుకు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య – వెంకటేష్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో డిసెంబర్ 27న రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆ ఎపిసోడ్ ప్రోమో చూసేయండి..
Also Read : Yash : విలన్ పాత్ర కోసం అన్ని వందల కోట్లు.. స్టార్ హీరోలని మించే రెమ్యూనరేషన్..