Venkatesh – Suresh Babu : అన్‌స్టాపబుల్ షోలో నాన్నని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన వెంకటేష్, సురేష్ బాబు..
నాన్న గురించి మాట్లాడుతూ సురేష్ బాబు, వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు.

Venkatesh and Suresh Babu gets emotional while talking about their Father Producer Ramanaidu
Venkatesh – Suresh Babu : ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో నుంచి తాజాగా నేడు ఏడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ వచ్చి సందడి చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఎంటర్టైన్మెంట్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ తో పాటు సురేష్ బాబు, అనిల్ రావిపూడి కూడా వచ్చారు.
తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రోమోలో వెంకటేష్ తన కూతుళ్ళ గురించి, నాగ చైతన్య గురించి మాట్లాడారు. అలాగే బాలయ్య – వెంకటేష్ ఒకరి డైలాగ్స్ ఒకరు చెప్పారు. సురేష్ బాబు వచ్చి వెంకటేష్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అన్నదమ్ములు ఇద్దరూ రావడంతో వెంకటేష్, సురేష్ బాబు నాన్న, దివంగత స్టార్ నిర్మాత రామానాయుడు గురించి బాలయ్య అడిగారు.
Also Read : RRR Documentary : ఓటీటీలోకి ‘RRR డాక్యుమెంటరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?
ఈ క్రమంలో నాన్న గురించి మాట్లాడుతూ సురేష్ బాబు, వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. వెంకటేష్.. అవి చివరి రోజులు.. నేను చాలా బాధపడ్డాను. ఏదో ఒకటి చేసి ఉంటే బాగుండేది అనిపించింది అన్నారు. సురేష్ బాబు కూడా నాన్న గురించి మాట్లాడారు. మరి వెంకటేష్ దేని గురించి అన్నారు, ఇద్దరూ నాన్నని తలుచుకొని ఎందుకు ఎమోషనల్ అయ్యారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.
ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే వెంకీమామ ఎమోషనల్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో మీరు కూడా చూసేయండి..
Also Read : Mufasa – Mahesh Babu : వాయిస్‌తోనే రికార్డ్ సెట్ చేసిన మహేష్ బాబు.. ‘ముఫాసా’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?