RRR Documentary : ఓటీటీలోకి ‘RRR డాక్యుమెంటరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?

RRR బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు.

RRR Documentary : ఓటీటీలోకి ‘RRR డాక్యుమెంటరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?

Rajamouli RRR Documentary OTT Streaming date fix

Updated On : December 24, 2024 / 3:10 PM IST

RRR Documentary : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ RRR ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఈ సినిమా 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడమే కాకుండా ఆస్కార్ అవార్డు ను సైతం అందుకుంది.

అయితే ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడం వెనక ఉన్న కష్టాన్ని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కిస్తున్నారు. RRR బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ విడుదల డేట్ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు అధికారిక ప్రకటన చేశారు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీసుల ప్రశ్నల వర్షం.. విచారణలో ఏం జరుగుతుంది..?

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నెట్‌ఫ్లిక్స్‌ దీనికి సంబదించిన పోస్టర్ రిలీజ్ చేశారు. 1 గంట 38 నిమిషాల నిడివితో వస్తున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ లో షూటింగ్ ఎలా జరిగింది, ఆస్కార్ వరకు ఎలా వెళ్లారు అన్నది చాలా బాగా చూపించారు.