×
Ad

Akhanda 2 Review; అఖండ 2 రివ్యూ: బాలయ్య తాండవం ఎలా ఉంది.. సినిమా హిట్టా? ఫట్టా?

బాలయ్య బాబు మరోసారి మ్యాజిక్ చేశారా? బోయపాటి మార్క్ మాస్ జాతర ఎలా ఉంది(Akhanda 2 Review)? పెద్ద స్క్రీన్ మీద సినిమా ఎలా ఉందో... ఇక్కడ ఉన్న రివ్యూ లో చదవండి.

Balakrishna - Akhanda 2 Thandavam Review

Akhanda 2 Thandavam Review: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ 2: తాండవం(Akhanda 2 Review)’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. 2021లో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్ అని మనందరికీ తెలిసిందే. కొన్ని ఇబ్బందుల వల్ల రిలీజ్ కాస్త లేట్ అయినా… భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి బాలయ్య బాబు మరోసారి మ్యాజిక్ చేశారా? బోయపాటి మార్క్ మాస్ జాతర ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం.

కథేంటంటే?

చైనా ఆర్మీ అధికారులు మన దేశంపై బయోవార్ ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా మహా కుంభమేళాను టార్గెట్ చేసి దేశంలో కల్లోలం సృష్టించాలనుకుంటారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ప్రధాని ఆదేశాల మేరకు DRDO శాస్త్రవేత్త జనని (హర్షాలి మల్హోత్రా) ఆ వైరస్‌కు విరుగుడు కనిపెడుతుంది. దాంతో విలన్ గ్యాంగ్ ఆమెను చంపడానికి వెంటపడుతారు. “నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వస్తా” అని మాటిచ్చిన అఖండ (బాలకృష్ణ) ఎంట్రీ ఇస్తాడు. పాపను కాపాడి, బయోవార్‌ను అడ్డుకుని, దేశంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు అన్నదే అసలు కథ.

విశ్లేషణ:
ఇండియా టార్గెట్ గా చైనా బయోవార్ ప్లాన్ చేయడం అనేది గతంలో సూర్య నటించిన 7th సెన్స్ లో చూశాం. కానీ, అదే కాన్సెప్ట్ కు డివోషనల్ కంటెంట్ యాడ్ చేస్తే అదే అఖండ 2. స‌నాత‌న ధ‌ర్మం, న‌మ్మ‌కాలు, వేద‌జ్ఞానాల గొప్ప‌త‌నం ఇలాంటి చాలా విషయాలను ఈ సినిమాలో చూపించారు. దానికోసం అఘోరా పాత్ర‌ను అద్భుతంగా సెట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ సదా సీదా సీన్స్ తో అలా సాగిపోతూ ఉంటుంది. కానీ, ఇంటర్వెల్ తరువాత నెక్స్ట్ లెవల్ లో వెళుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అఘోర ఎంట్రీ సనాతన ధర్మం గురించి చెప్పే సీన్స్, యాక్షన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇక క్లైమాక్స్ కూడా అదే రేంజ్ లో సెట్ చేశారు. అయితే, మాస్ ఎలిమెంట్స్ కోసం దర్శకుడు నడిపించిన తీరు కాస్త డిజప్పాయింట్ గా అనిపిస్తుంది. ఓవర్ ఆల్ గా కథ రొటీన్ గానే అనిపించినా.. ధర్మ రక్షణ, సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం గొప్పగా అనిపిస్తుంది.

నటీనటులు:
అఖండ 2 అనేది బాల‌కృష్ణ వ‌న్ మేన్ షో అని చెప్పొచ్చు. అఘోరా పాత్ర‌లో ఆయన మరోసారి విశ్వ‌రూపం చూపించారు. ముర‌ళీకృష్ణ,ఆ అఘోరాగా రెండు పాత్రల్లో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, యాక్ష‌న్ సీక్వెన్స్ లలో ఆయనకు ఆయనే సాటి అనే రేంజ్ లో మెప్పించారు. ఇక హీరోయిన్ సంయుక్త పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. కేవలం జాజికాయ పాట కోసం మాత్రమే తీసుకున్నారు అనిపిస్తుంది. ప్రధానంగా సినిమా అంతా హ‌ర్షాలీ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమె నటన చాలా సహజంగా ఉంది. విలన్ గా ఆది పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉంది. మిగతావారు కూడా సోసో గానే చేశారు. విజి చంద్ర‌శేఖ‌ర్ పోషించిన త‌ల్లి పాత్ర‌, ఆ నేప‌థ్యంలో పండిన సెంటిమెంట్ సినిమాకి బలాన్ని చేకూర్చాయి.

టెక్నికల్ అంశాలు:

బోయపాటి శ్రీను తన పాత స్టైల్‌నే నమ్ముకున్నారు. లాజిక్ కంటే ఎంటర్టైన్‌మెంట్‌కే ఓటు వేశారు. కొన్ని సీన్స్ బాగున్నా, మరికొన్ని సాగదీసినట్లు అనిపిస్తాయి. అయినా సినిమా స్పీడ్ ఎక్కడా తగ్గదు, బోర్ కొట్టదు. కెమెరా పనితనం చాలా బాగుంది, యాక్షన్ సీన్లని రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి, సినిమా చూస్తున్నంత సేపు ఆ గ్రాండియర్ కనిపిస్తుంది.

ఫైనల్ గా ఎలా ఉందంటే?

మొత్తంగా చూస్తే ‘అఖండ 2’ బాలయ్య వన్ మ్యాన్ షో. భక్తి, యాక్షన్ కలగలిసిన డ్రామా. ఇది ధర్మరక్షణ కోసం అఘోర చేసే యుద్ధం.