Aditya 369 : బాలయ్య సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369 రీ రిలీజ్.. ఎప్పుడంటే..

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ సినిమా 'ఆదిత్య 369' ఇప్పుడు రీ రిలీజ్ కానుంది.

Balakrishna Super hit science fiction film Aditya 369 Re Releasing

Aditya 369 Movie : ఇటీవల రీ రిలీజ్ లు ప్రతివారం ఏదో ఒక సినిమా ఉంటుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు అన్ని రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమా కూడా రీ రిలీజ్ కానుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’ ఇప్పుడు రీ రిలీజ్ కానుంది.

బాలకృష్ణ, మోహిని జంటగా, టిను ఆనంద్, అమ్రిష్ పూరి, సిల్క్ స్మిత.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఆదిత్య 369 సినిమా 1991లో రిలీజయి అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్య బాబు శ్రీ కృష్ణదేవరాయలుగా నటించి అదరగొట్టారు. భూత భవిష్యత్ ప్రస్తుత కాలాలు ఎలా ఉంటాయి అని ఆసక్తిగా చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఆదిత్య 369 సినిమా ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తున్నారు.

Also Reda : Samantha – Thaman : సమంత ఫోన్ చేసి.. నాకు, చైతూకి పెళ్లయ్యాక ఫస్ట్ సినిమా ప్లీజ్ అని అడిగితే.. వారం రోజుల్లో 90 మందితో..

ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాని 4kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. 34 ఏళ్ళ క్రితం జూలై 18,‌ 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. అప్పట్లోనే ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఈ సినిమాని నేను నిర్మించడానికి సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాంతం రుణపడి వుంటాను. ఈ సినిమాతో నిర్మాతగా నన్ను ఎన్నో మెట్లు ఎక్కించిన నందమూరి బాలకృష్ణ గారికి, సింగీతం శ్రీనివాసరావు గారికి రీ రిలీజ్ చేస్తున్నామని చెబితే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నాం. నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఇదొక గొప్ప కానుక.‌ ఈ సినిమా మరోసారి ప్రేక్షాదరణ పొంది బాలయ్య బాబు హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. మరి ఈ సినిమాకు థియేటర్స్ లో బాలయ్య సీనియర్ ఫ్యాన్స్ కూడా వచ్చి సందడి చేస్తారేమో చూడాలి.