Samantha – Thaman : సమంత ఫోన్ చేసి.. నాకు, చైతూకి పెళ్లయ్యాక ఫస్ట్ సినిమా ప్లీజ్ అని అడిగితే.. వారం రోజుల్లో 90 మందితో..

తమన్ మజిలీ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపాడు.

Samantha – Thaman : సమంత ఫోన్ చేసి.. నాకు, చైతూకి పెళ్లయ్యాక ఫస్ట్ సినిమా ప్లీజ్ అని అడిగితే.. వారం రోజుల్లో 90 మందితో..

Music Director Thaman Revealed Interesting thing about Naga Chaitanya Samantha Majili Movie

Updated On : March 18, 2025 / 2:37 PM IST

Samantha – Thaman : తమన్ ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు సగం పైన తమన్ చేతిలోనే ఉన్నాయి. ఇటీవల తమన్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో వచ్చి మెప్పించాడు. త్వరలో రాజాసాబ్ తో రానున్నాడు.

ఫుల్ బిజీగా ఉన్న తమన్ తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపాడు. అయితే సమంత – నాగచైతన్య మజిలీ సినిమాకు సాంగ్స్ గోపిసుందర్ ఇవ్వగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపాడు.

Also Read : Return Of The Dragon : ఓటీటీలోకి ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్క‌డంటే ?

తమన్ మాట్లాడుతూ.. మజిలీ సినిమాకు సాంగ్స్ గోపిసుందర్ ఇచ్చాడు. నేను బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాను. శివ నిర్వాణ నాకు వచ్చి కథ చెప్పాడు. సమంత ఫోన్ చేసి ఈ సినిమా నాకు, చైతుకి పెళ్లి అయ్యాక మొదటి సినిమా. ఇది కచ్చితంగా హిట్ అవ్వాలి. ప్లీజ్ మీరే దీనికి మ్యూజిక్ చేయాలి. నేను, చైతు వచ్చి కలవాలి అనుకుంటున్నాము అని చెప్పింది. అవసర్లేదు మీరు నన్ను నమ్మి కాల్ చేసారు, నేను చేస్తాను అని చెప్పాను. మార్చ్ 22న నాకు సినిమా చూపించారు. మార్చ్ 23న నాకు సినిమా వచ్చింది. ఏప్రిల్ 5న రిలీజ్ ఉంది. నాకు 10 రోజులు టైం పట్టుద్ది కనీసం అని చెప్పాను. అప్పుడు సమంత మళ్ళీ ఫోన్ చేసి తక్కువ టైం ఉంది అని అడిగింది.

సాంగ్స్ కూడా నేనే చేస్తే ఒకే లూప్ లో కొట్టేవాడ్ని మ్యూజిక్. కానీ గోపిసుందర్ సాంగ్స్ ఇవ్వడంతో ఆ సాంగ్స్ అన్ని చాలా సార్లు లూప్ లో విని నేను ఆ మ్యూజిక్ మోడ్ లోకి వెళ్లి పనిచేసాను. 90 మంది అర్కీస్ట్రా పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని రూమ్స్ తీసుకొని పనిచేసాను. బడ్జెట్ పెరిగిపోతుంది అని ప్రొడ్యూసర్స్ కంగారుపడ్డారు. బిల్ గురించి ఆలోచించొద్దు అని చెప్పాను. మార్చ్ 23 నాకు సినిమా ఇస్తే 30న ఫైనల్ బ్యాక్ గ్రౌండ్ అవుట్ పుట్ ఇచ్చాను. రెండు రోజుల్లో ఫైనల్ మిక్స్ చేసి ఏప్రిల్ 1న కంప్లీట్ అవుట్ పుట్ ఇచ్చాను. ఏప్రిల్ 5న సినిమా రిలీజయింది. వారం రోజులు అన్ని వర్క్స్ పక్కన పెట్టేసి దానిమీదే పనిచేసాను. ఆ సినిమా నాకు ఒక మంచి మ్యాజిక్ లాంటి ఫీల్ ఇచ్చింది అని తెలిపారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also See : Paanch Minar : రాజ్‌త‌రుణ్ ‘పాంచ్ మినార్’ నుంచి ఏం బ‌తుకురా నాది సాంగ్‌..

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య – సమంత జంటగా తెరకెక్కినా మజిలీ సినిమా 2019లో రిలీజయి పెద్ద హిట్ అయింది. పెళ్లి తర్వాత వారిద్దరి కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఆ సినిమాపై హైప్స్ కూడా ఉన్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు, గోపిసుందర్ సాంగ్స్ కూడా ఆ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అయితే సమంత – చైతు తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే.