Return Of The Dragon : ఓటీటీలోకి ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్క‌డంటే ?

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ న‌టించిన రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.

Return Of The Dragon : ఓటీటీలోకి ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్క‌డంటే ?

Pradeep Ranganathan Return Of The Dragon ott streaming date fix

Updated On : March 18, 2025 / 1:49 PM IST

‘ల‌వ్ టుడే’ చిత్రంతో త‌మిళంలోనే కాదు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. ఆయన హీరోగా న‌టించిన చిత్రం ‘రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌’. అశ్వత్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. అర్చనా కల్పతి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫిబ్ర‌వ‌రి 21న ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి శుభ‌వార్త ఇది.

Rajamouli : ప్ర‌ముఖ ర‌చ‌యిత మృతిపై రాజ‌మౌళి సంతాపం.. బాధగా ఉంది..

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Sukumar : సుకుమార్ నెక్ట్స్‌బిగ్ ప్రాజెక్ట్ ఇదే..!

ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. ఈ చిత్రాన్ని మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ళ‌యాళ బాష‌ల్లో ఈచిత్రం అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలిపింది.