Pradeep Ranganathan Return Of The Dragon ott streaming date fix
‘లవ్ టుడే’ చిత్రంతో తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. అర్చనా కల్పతి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫిబ్రవరి 21న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి శుభవార్త ఇది.
Rajamouli : ప్రముఖ రచయిత మృతిపై రాజమౌళి సంతాపం.. బాధగా ఉంది..
Sukumar : సుకుమార్ నెక్ట్స్‌బిగ్ ప్రాజెక్ట్ ఇదే..!
ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ బాషల్లో ఈచిత్రం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.