Sukumar : సుకుమార్ నెక్ట్స్‌బిగ్ ప్రాజెక్ట్ ఇదే..!
పుష్ప-2 టేకింగ్, సినిమా సక్సెస్‌తో ఆ స్టార్ హీరో సుక్కుతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట

పుష్ప-2 గ్రాండ్ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ సుకుమార్.. నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ సెంట్రిక్‌గా పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. అందుకోసం ఓ పెద్ద స్టార్‌తో డిస్కషన్స్ నడుస్తున్నాయట.
పుష్ప-2 టేకింగ్, సినిమా సక్సెస్‌తో ఆ స్టార్ హీరో సుక్కుతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. RC17 మూవీ తర్వాత ఆ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో మూవీ చేయబోతున్నాడ సుకుమార్.
సుకుమార్ డైరెక్షన్‌లో SRK ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడట. అంజామ్ తరహా సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సౌత్ ప్లస్ నార్త్ మిక్స్‌డ్ స్టోరీతో మూవీ ఉండబోతోందట.
Kangana Ranaut : ఆ సిల్లీ ఆస్కార్ ని అమెరికానే ఉంచుకోమను.. ఎమర్జెన్సీ మూవీపై కంగనా
ప్రస్తుతం సుకుమార్ రామ్‌చరణ్ RC17 స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నాడు. చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్, చరణ్ కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. RC17 తర్వాత షారుఖ్‌ఖాన్‌తో సుకుమార్ మూవీ చేస్తారని అంటున్నారు.
పుష్ప సినిమా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అవ్వటం, కలెక్షన్స్ కొల్లగొట్టడంతో సుకుమార్‌కు నార్త్‌లో ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో ఆయనను బాలీవుడ్ స్టార్స్ అప్రోచ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుకుమార్, షారుఖ్ మూవీ పక్కానా లేక ప్రచారమేనా అనేది తేలాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.