Unstoppable 3 : మేము తప్పు చేయలేదని మీకు తెలుసు.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య కామెంట్స్..

అన్‌స్టాపబుల్‌ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ప్రోమో బాలయ్య.. మేము తప్పు చేయలేదని మీకు తెలుసు అంటూ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతుంది.

Balakrishna Unstoppable season 3 first episode with Bhagavanth Kesari Movie Team

Unstoppable 3 : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. సీజన్ 1, సీజన్ 2 కి ఓ రేంజ్ రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సీజన్ 3ని బాలకృష్ణ నటిస్తున్న కొత్త మూవీ ‘భగవంత్ కేసరి’ చిత్ర యూనిట్ తో స్టార్ట్ చేస్తున్నారు. కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి.. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ గెస్ట్ లుగా రాబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.

దర్శకుడు, హీరోయిన్స్ తో ఎపిసోడ్ కదా సరదా సినిమాల గురించి సాగుతుందని ప్రేక్షకులంతా భావించారు. కానీ ప్రోమో స్టార్టింగ్ తో ఆడియన్స్ కి గట్టి థ్రిల్ ఇచ్చారు. “మేము తప్పు చేయలేదని మీకు తెలుసు, మేము తల వంచము అని మీకు తెలుసు, మమ్మల్ని ఆపడానికి ఎవరు రాలేడని మీకు తెలుసు” అంటూ ప్రోమో మొదటిలో బాలయ్య చెప్పిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గత కొన్ని రోజులుగా బాలయ్య ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే బాలయ్య ప్రోమోలో చెప్పిన డైలాగ్స్ ని ఏపీ పాలిటిక్స్ కి సింక్ అవుతున్నాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Nagarjuna : నాగార్జున సినిమాతో.. టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు గొడవ..

ఇక ప్రోమోలోని మిగతా భాగానికి వస్తే.. మూవీ టీంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. బాలయ్య కాజల్ అగర్వాల్ తో మాట్లాడుతూ.. ‘నువ్వు కొణిదెల ఫ్యామిలీ, నందమూరిని పూర్తిగా కవర్ చేశావు. మంచు ఫ్యామిలీతో కూడా ఛాన్స్ వస్తే చేస్తావా’ అని అడిగాడు. దానికి కాజల్ బదులిస్తూ.. 100 పర్సెంట్ చేస్తాను అంటూ బదులిచ్చింది. మరి ఆ ఎంటర్‌టైనింగ్ ప్రోమోని ఒకసారి మీరుకూడా చూసేయండి.