Unstoppable 4 : సెకండ్ ఎపిసోడ్ ప్రొమో వ‌చ్చేసింది.. ల‌క్కీ భాస్క‌ర్ టీమ్‌తో బాల‌య్య.. మామూలుగా లేదుగా..

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.

Unstoppable With NBK S4 E2 Promo

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 గ‌త వారం ప్రారంభ‌మైంది. ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారాచంద్ర‌బాబు నాయుడు రాగా.. రెండో ఎపిసోడ్‌కు ఎవ‌రు వ‌స్తారా ? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది. రెండో ఎపిసోడ్‌కు ల‌క్కీ భాస్క‌ర్ మూవీ టీమ్ వ‌చ్చింది. హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌద‌రి, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీలు సంద‌డి చేశారు.

Thandel : తండేల్ రిలీజ్ గురించి ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు.. రామ్‌చ‌ర‌ణ్ కోసం అర‌వింద్‌గారు, వెంకీమామ కోసం చైత‌న్య గారు..

ప్రోమో ప్రారంభంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చారు. గడ్డు కాలం ఎదురొచ్చినా, చెడ్డవాడు ఎగేసుకొచ్చినా అనే డైలాగ్‌ను త‌న‌దైన శైలిలో చెప్పారు. మొద‌ట‌గా దుల్కర్ సల్మాన్ ను స్టేజ్ పైకి పిలుస్తారు. ఏంటి ఈ గ్లామర్ నన్ను నేను చూసుకున్న‌ట్లుగా ఉంది అని దుల్కర్‌తో బాల‌య్య అన్నారు. ఆ త‌రువాత దుల్క‌ర్‌తో ఓ గేమ్ ఆడిస్తారు. త‌న ల‌వ్ స్టోరీలు చెప్పించారు. మొత్తంగా ప్రొమో స‌ర‌దా స‌ర‌దాగా సాగింది.