Thandel : తండేల్ రిలీజ్ గురించి ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు.. రామ్‌చ‌ర‌ణ్ కోసం అర‌వింద్‌గారు, వెంకీమామ కోసం చైత‌న్య గారు..

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం తండేల్‌.

Thandel : తండేల్ రిలీజ్ గురించి ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు.. రామ్‌చ‌ర‌ణ్ కోసం అర‌వింద్‌గారు, వెంకీమామ కోసం చైత‌న్య గారు..

Director Chandoo Mondeti intresting comments on Thandel release

Updated On : October 29, 2024 / 4:26 PM IST

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం తండేల్‌. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా.. ఈ సినిమా విడుద‌ల గురించి ద‌ర్శ‌కుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు.

సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన‌ట్లు చెప్పారు. మ‌రో 10 రోజుల షూట్ మాత్ర‌మే మిగిలి ఉంద‌న్నారు. అయితే.. చ‌ర‌ణ్ సినిమా వ‌స్తుంద‌ని అరవింద్ గారు, వెంకీ మామ సినిమా వ‌స్తుంద‌ని చైత‌న్య ఆలోచిస్తే మాత్రం తండేల్ సినిమా సంక్రాంతి నుంచి త‌ప్పుకుంటుంది అని చెప్పారు.

Jai Hanuman : ‘జై హ‌నుమాన్’ అప్‌డేట్ ఇచ్చిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. రేపే ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. హీరో ఎవ‌రు?

ఒకవేళ జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేద్దామ‌ని అనుకుంటే ఆ రోజు ఆదివారం వ‌స్తుంది కాబ‌ట్టి అవ‌కాశ‌మే లేద‌న్నారు. పోనీ సంక్రాంతికి ముందే విడుద‌ల చేద్దామ‌ని అనుకుంటే అప్ప‌టికి సినిమా పూర్తి కాద‌న్నారు.

ఇక ఈ మూవీలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి నటిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Aha : ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అడివి శేష్.. కొత్త వీడియో చూసారా..