Aha : ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అడివి శేష్.. కొత్త వీడియో చూసారా..

Aha : ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అడివి శేష్.. కొత్త వీడియో చూసారా..

Hero Adivi Sesh as brand ambassador of Aha Gold

Updated On : October 29, 2024 / 3:47 PM IST

Aha : ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సరికొత్త సినిమాలు, షోలు, గేమ్ షోలు వస్తుంటాయి. ఇందులో భాగంగానే బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఆహా ప్రీమియం గోల్డ్ సబ్ స్క్రిప్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ను నియమించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది ఆహా.

Also Read : Unstoppable 4 : అన్‌స్టాపబుల్ లో బాలయ్యతో కలిసి తొడకొట్టిన స్టార్ హీరో..

ఇకనుండి బ్లాక్ బస్టర్ సినిమాలు, టాక్ షోస్, రియాలిటీ షోస్, యాడ్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కోసం ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ పొందండి అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. బ్లాక్ సూట్ వేసుకొని చాలా స్టైలిష్ గా వీడియోలో కనిపించాడు అడివి శేష్. అయితే ఇందులో 4K HD, డాల్ బీ ఆడియో, తెలుగుతో పాటు తమిళ్ కంటెంట్ కూడా అంటుందని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న అడివి శేష్ గోల్డ్ సబ్ స్క్రిప్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది.. సెలెబ్రిటీస్ అందరూ ఇలా కలవడం అద్భుతం, ఇప్పటి నుండి ఆహా మీ అందరికి మరింత మంచి కంటెంట్ అందిస్తారు అంటూ తెలిపారు.