Jai Hanuman : ‘జై హ‌నుమాన్’ అప్‌డేట్ ఇచ్చిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. రేపే ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. హీరో ఎవ‌రు?

తేజ స‌జ్జ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హ‌నుమాన్ మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే.

Jai Hanuman : ‘జై హ‌నుమాన్’ అప్‌డేట్ ఇచ్చిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. రేపే ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. హీరో ఎవ‌రు?

Prasanth Varma Jai Hanuman First Look Tomorrow

Updated On : October 29, 2024 / 3:59 PM IST

తేజ స‌జ్జ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హ‌నుమాన్ మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా జై హ‌నుమాన్‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఎప్పుడో చెప్పేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మ‌రిన్ని సినిమాలు రానున్న‌ట్లు తెలిపాడు. దీంతో ఈ మూవీల కోసం సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు.

తాజాగా జై హ‌నుమాన్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను రేపు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఈ పోస్ట‌ర్‌లో హనుమంతుడు ఓ పురాతన దేవాలయం వైపు న‌డుచుకుంటూ వెలుతున్న‌ట్లుగా చూపించారు. ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మార‌డంతో పాటు జై హ‌నుమాన్ మూవీ పై అంచ‌నాల‌ను పెంచేసింది.

Aha : ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అడివి శేష్.. కొత్త వీడియో చూసారా..

Image

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హ‌నుమంతుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొని ఉంది. రానా, రామ్‌చ‌ర‌ణ్‌, రిష‌బ్ శెట్టి వంటి పేర్లు వినిపించాయి. ఈ ముగ్గురిలో ఒక‌రు న‌టించ‌నున్నారా? లేక మ‌రెవ‌రు న‌టించ‌నున్నారు అనే విష‌యం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో తేలిపోయే అవ‌కాశం ఉంది. హ‌నుమాన్ మూవీలో ఉన్న తేజ స‌జ్జ సీక్వెల్ మూవీలోనూ ఉండే అవ‌కాశం ఉంది.

Unstoppable 4 : అన్‌స్టాపబుల్ లో బాలయ్యతో కలిసి తొడకొట్టిన స్టార్ హీరో..