Prasanth Varma Jai Hanuman First Look Tomorrow
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్‌ను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎప్పుడో చెప్పేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మరిన్ని సినిమాలు రానున్నట్లు తెలిపాడు. దీంతో ఈ మూవీల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
తాజాగా జై హనుమాన్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రీ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ పోస్టర్‌లో హనుమంతుడు ఓ పురాతన దేవాలయం వైపు నడుచుకుంటూ వెలుతున్నట్లుగా చూపించారు. ఈ పోస్టర్ వైరల్‌గా మారడంతో పాటు జై హనుమాన్ మూవీ పై అంచనాలను పెంచేసింది.
Aha : ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అడివి శేష్.. కొత్త వీడియో చూసారా..
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. రానా, రామ్‌చరణ్, రిషబ్ శెట్టి వంటి పేర్లు వినిపించాయి. ఈ ముగ్గురిలో ఒకరు నటించనున్నారా? లేక మరెవరు నటించనున్నారు అనే విషయం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో తేలిపోయే అవకాశం ఉంది. హనుమాన్ మూవీలో ఉన్న తేజ సజ్జ సీక్వెల్ మూవీలోనూ ఉండే అవకాశం ఉంది.
Unstoppable 4 : అన్‌స్టాపబుల్ లో బాలయ్యతో కలిసి తొడకొట్టిన స్టార్ హీరో..
This Diwali, bringing the legends to life with a tale that rekindles the flames of valor and honors our Indian Itihasas❤️🔥@MythriOfficial @ThePVCU #JAIHANUMAN 🔥 #NaveenYerneni @mythriravi #PVCU #DIWALIisCOMING 🪔 pic.twitter.com/sjOFBC5vIV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2024