Balakrishna – Venkatesh : బాలయ్య, వెంకిమామ అన్‌స్టాపబుల్ షూటింగ్ పూర్తి.. షూట్ నుంచి సరదా ఫొటోలు వైరల్..

నేడు వెంకిమామ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిందని తెలుస్తుంది.

Balakrishna Venkatesh Photos Shares From Aha Unstoppable Shooting Set

Balakrishna – Venkatesh : ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 కాస్త గ్యాప్ ఇచ్చి త్వరలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ తో రానుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ వచ్చి ప్రేక్షకులను మెప్పించగా ఏడో ఎపిసోడ్ లో వెంకీమామ రాబోతున్నాడు.

 

నేడు ఉదయం వెంకిమామ అన్‌స్టాపబుల్ సెట్స్ కి వెళ్లి బాలయ్యను కలిసినట్టు వీడియో వైరల్ అయింది. దీంతో నేడు వెంకిమామ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిందని తెలుస్తుంది.

ఈ ఎపిసోడ్ కి అనిల్ రావిపూడి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. తాజగా షూటింగ్ అయిపోవడంతో షూట్ లో తీసిన పలు ఫోటోలను ఆహా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫొటోలో బాలయ్య, వెంకటేష్ సందడి చేశారు. ఈ ఫోటోలను చూస్తుంటేనే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని అర్థమైపోతుంది.

సీనియర్ హీరోలు వెంకటేష్ – బాలకృష్ణ ఒకే షోలో ఇలా రాబోతుండటంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ రానుంది.