Unstoppable : ముగ్గురు భామలకు స్పెషల్ చీరలు పంపిన బాలయ్య వైఫ్..

ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. ముగ్గురి భామలతో బాలయ్య సరదాగా మాట్లాడి, ఆటలు ఆడించి హంగామా చేశారు. ఇక ఎప్పటిలాగే ఎపిసోడ్ నుంచి వెళ్లేముందు వచ్చిన గెస్టులకి....................

Balakrishna Wife gifted sarees to Unstoppable guests

Unstoppable :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.

Unstoppable : కాంట్రవర్సీ ప్రశ్నలకి అదిరిపోయే సమాధానాలు ఇచ్చిన ముగ్గురు భామలు..

ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. ముగ్గురి భామలతో బాలయ్య సరదాగా మాట్లాడి, ఆటలు ఆడించి హంగామా చేశారు. ఇక ఎప్పటిలాగే ఎపిసోడ్ నుంచి వెళ్లేముందు వచ్చిన గెస్టులకి స్పాన్సర్స్ ఇచ్చే గిఫ్ట్ ఫ్యాక్స్ ఇచ్చారు. అయితే ఈ సారి ఈ ముగ్గురు భామలకు గిఫ్ట్ ఫ్యాక్స్ తో పాటు తన భార్య వసుంధర దేవి స్పెషల్ గా చీరలని పంపించిందని చెప్పి ముగ్గురికి చీరలని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు బాలయ్య.