Balakrishna – Vishwak Sen : ఫ్యాన్స్ గెట్ రెడీ.. విశ్వక్ సేన్ సినిమాలో బాలయ్య బాబు గెస్ట్ రోల్.. చాన్నాళ్లకు కామెడీతో..

యువ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు.

Balakrishna Vishwak Sen

Balakrishna – Vishwak Sen : బాలయ్య బాబు ప్రస్తుతం అన్ని సీరియస్ కథాంశం ఉన్న సినిమాలే చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు. అఖండ సినిమా నుంచి ఆగకుండా దూసుకుపోతున్నారు బాలకృష్ణ. త్వరలో అఖండ 2 సినిమాతో రాబోతున్నాడు. బాలకృష్ణ కామెడీ చూసి చాన్నాళ్ళైపోతుంది. అందుకే ఫ్యాన్స్ లో ఆ కొరత తీర్చేందుకు బాలయ్య ఓ కామిక్ రోల్ తో రాబోతున్నారని సమాచారం.

యువ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 చేయబోతున్నాడు. ఇటీవలే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మొత్తం అదే నటీనటులతో ఈ నగరానికి ఏమైంది 2 సినిమాని ENE రిపీట్ అనే టైటిల్ తో ప్రకటించారు. ఈసారి కూడా యూత్ ఫుల్ కామెడీతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : Ram Pothineni : రాజమండ్రిలో ‘రామ్’ షూటింగ్.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..

అయితే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 లో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తాడని, సినిమాలో 15 నిముషాలు కనిపిస్తాడని సమాచారం. విశ్వక్ సేన్ – బాలకృష్ణ క్లోజ్ అని తెలిసిందే. ఈ క్రమంలో విశ్వక్, తరుణ్ భాస్కర్ అడగడంతో బాలయ్య ఒప్పుకున్నాడని టాలీవుడ్ లో సమాచారం. ఇదే కనక నిజమైతే ఈ నగరానికి ఏమైంది సినిమాకు మరింత హైప్ రావడమే కాక బాలయ్యని ఓ కొత్త అవతారంలో చూడొచ్చు అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.