Balakrishna will Play Super Hero Role in next Movie Rumours goes Viral
Balakrishna : బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్ కొట్టారు బాలయ్య. ఇక ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అనే షోతో వరుసగా మూడు సీజన్లు సందడి చేసారు. ఆ షో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరో పక్క హిందూపూర్ లో ఇటీవల మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ గెలుపు సాధించారు.
ఇలా బాలకృష్ణ ఓ పక్క సినిమాల్లో, మరో పక్క షోలలో, మరో పక్క రాజకీయాలలో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నారు బాలయ్య. అయితే తాజాగా ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.
Also Read : Vettaiyan : ‘వేట్టయన్’ మూవీ రివ్యూ.. రొటీన్ కథకు సూపర్ స్టార్ హంగులు..
బాలకృష్ణ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నారట. అయితే అది సినిమాలో హీరోగానా లేక ఇంకేదైనా కొత్త తరహాలోనా అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా దసరా కానుకగా రేపు అక్టోబర్ 11న వస్తుందని సమాచారం. ఈ పాత్ర టాలీవుడ్ లో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తుంది అని అంటున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే బాలయ్య సూపర్ హీరోగా కనిపించబోతున్నారా అంటే ఎదురుచూడాల్సిందే.