Unstoppable With Nbk
Unstoppable With NBK : ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’. దీనికి టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. హోస్ట్ గా తనదైన శైలిలో రాణిస్తూ ఈ షో కే బాలయ్య ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చారు. ప్రముఖులను బాలయ్య ఇంటర్వ్యూ చేసే స్టైల్ ను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
Summer Release: ఉగాదితో మొదలు.. ఈ సమ్మర్ అంతా సినిమా జాతరే
ఇప్పటికే ఏడు ఎపిసోడ్లు పూర్తి కాగా ఇప్పుడు 8వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకి నటుడు దగ్గుబాటి రానా విచ్చేశారు. ఈ మేరకు తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. బాలయ్య, రానా మాట్లాడుకున్న విషయాలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ దూసుకుపోతోందని రానా చెప్పగా… ‘కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య అంటేనే బెస్ట్’ అంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బాలయ్యను భార్యాభర్తలకు చెందిన కొన్ని ప్రశ్నలు అడిగాడు రానా. “ఇద్దరూ గొడవపడితే ఎవరు ముందు సారీ చెబుతారు? అని ప్రశ్నించగా, “నేనే” అంటూ బాలయ్య ప్లకార్డు చూపించారు. “శ్రీకృష్ణుడు అంతటివాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు, ఇక బాలకృష్ణుడు ఒక లెక్కా!” అంటూ చమత్కరించారు.
Tollywood Malty-starers: క్రేజీ మల్టీస్టారర్స్.. ఒకే టికెట్‌పై డబుల్ బోనాంజా!
ఆ తర్వాత “మీ భార్యకు ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పారా? అని రానా ప్రశ్నించగా, “నీకెందుకయ్యా!” అంటూ బాలయ్య చిరుకోపం ప్రదర్శించారు. అనంతరం తన శ్రీమతి వసుంధరకు ఫోన్ చేసి “ఐ లవ్ యూ వసూ” అని బాలయ్య స్వయంగా చెప్పడం హైలైట్. అటు ఈ ఇంటర్వ్యూలో ఏమంటివి.. ఏమంటివి అనే డైలాగ్‌ను రానా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎపిసోడ్ ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.