Balayya Getting Emotional After Hearing Siddu Jonnalagadda Story
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ గెస్టులుగా రాగా, రెండో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డలు హాజరుకాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇటీవల విడుదల చేశారు నిర్వాహకులు.
Unstoppable2: బాలయ్య షోకు పవన్, త్రివిక్రమ్ వచ్చేది అప్పుడేనా..?
తాజాగా మరో ఎమోషనల్ ప్రోమోని విడుదల చేసింది ఆహా టీం. డీజే టిల్లుతో అందర్నీ నవ్వించిన సిద్దు జొన్నలగడ్డ, బాలయ్యని మాత్రం ఏడిపించేసాడు. “నీ లైఫ్ లో జరిగిన అతి పెద్ద అవమానం” ఏంటని బాలయ్య ప్రశ్నించగా, సిద్దు బదులిస్తూ.. “నేను హీరో అవుదాం అనుకుంటున్నా అంటే, ఏంటి ఫేస్ మీద ఇన్ని మచ్చలు పెట్టుకొని హీరో అయిపోదాం అనుకుంటున్నావా” అంటూ పలు కామెంట్లు చేసేవారంటూ చెప్పుకొచ్చాడు.
“అవన్నీ విన్న బాలయ్య.. నువ్వు చెబుతుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. ఇంక చెప్పకు వదిలేయ్” అంటూ సిద్ధుని కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ ఎదురుకున్న పెద్ద సమస్య గురించి ప్రశ్నించగా.. ఇటీవల అతడి అక్క తీవ్ర అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో ఉన్న సమయంలో కూడా తాను షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందంటూ వెల్లడించాడు.