Unstoppable2: బాలయ్య షోకు పవన్, త్రివిక్రమ్ వచ్చేది అప్పుడేనా..?
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ గెస్టులుగా రాగా, వారితో బాలయ్య ముచ్చటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వీడియోలో బాలయ్య స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు చూపించారు.

Pawan Kalyan Trivikram To Come In Unstoppable 2 At This Time
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ గెస్టులుగా రాగా, వారితో బాలయ్య ముచ్చటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ టాక్ షో రెండో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డలు వస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
Unstoppable 2 : బావతో బాలయ్య సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!
అయితే రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వీడియోలో బాలయ్య స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు చూపించారు. కాగా, ఈ క్రమంలో త్రివిక్రమ్‌ను బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు ఎప్పుడు వస్తావని అడగగా.. వెంటనే రమ్మంటే వచ్చేస్తా అంటూ త్రివిక్రమ్ బదులిచ్చాడు. అయితే అన్‌స్టాపబుల్ షోకు ఎప్పుడు, ఎవరితో రావాలో తెలుసుగా అని బాలయ్య చెప్పడంతో ఇప్పుడు త్రివిక్రమ్‌తో ఎవరు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Unstoppable 2 : గ్రాండ్ ఎంట్రీతో అన్‌స్టాపబుల్ మొదలు.. అదరగొట్టిన బాలయ్య
కాగా, త్రివిక్రమ్ ఈ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వస్తాడని.. వారిద్దరు కలిసి ఈ షో చివరి ఎపిసోడ్‌కు గెస్టులుగా వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే అన్‌స్టాపబుల్ 2 షో చివరి ఎపిసోడ్‌కు పవన్, త్రివిక్రమ్ ఇద్దరు గెస్టులుగా వస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.