Kantara Chapter 1: కేరళలో కాంతార 1 విడుదలపై నిషేధం.. కారణం ఏంటంటే?

రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేసిన కాంతార (Kantara Chapter 1) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Ban on release of Kantara Chapter 1 in Kerala

Kantara Chapter 1: చిన్న సినిమాగా విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కన్నడ సినిమా కాంతార. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార: చాఫ్టర్ 1 తెరెకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరెకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్.

Dulquer Salmaan: ఒక సినిమా హిట్.. ఇంకో సినిమా పోస్ట్ పోన్.. దుల్కర్ ప్లాన్ మాములుగా లేదుగా!

అయితే, అంతా ఓకే కానీ.. కాంతార(Kantara Chapter 1) సినిమా కేరళలో విడుదలను నిషేదంచే అవకాశాలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ అధ్యక్షుడు కే. విజయకుమార్ మాట్లాడారు. “కేరళలో ఇతర భాషల సినిమాలు విడుదల చేసినప్పుడు తొలి వారం గరిష్టంగా 50% లాభాల్లో వాటా మాత్రమే డిమాండ్ చేయడానికి అనుమతి ఉంది. కానీ, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మాత్రం 55% లాభాలను రెండు వారాల పాటు డిమాండ్ చేస్తోంది. కేవలం COVID సమయంలో మాత్రమే 55% లాభాలను అనుమతించాము. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని అంగీకరించే ప్రసక్తి లేదు.

అలాగే మొహాలల్ నటించిన తుడ‌రం చిత్రం కేరళలో సూపర్ హిట్ అయ్యింది. కానీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం నిర్మాత నష్టాలను ఎదుర్కొవాల్సి వచ్చింది. ఎందుకంటే, ఇతర భాషా సినిమాలు కేరళలో ఎక్కువ వాటాను, తమ సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో తక్కువ వాటాకు ఒప్పుకుంటున్నారు. ఇది పెద్ద సమస్యగా మారింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి, లాభాల్లో వాటా విషయంలో కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ కఠినంగా ఉండంతో కాంతార చాప్టర్ 1 కేరళలో విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.